బాల్కొండ నియోజకవర్గ రైతులకు సాగు సమయంలో ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను కోరారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా వాడి గ్రామంలో రైతులు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయం పెంచాలని విజ్ఞప్తి చేయడంతో, ఆయన జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడారు. గతంలో రోజుకు 17-18 గంటల విద్యుత్ అందేదని, ప్రస్తుతం సరఫరా తగ్గిపోయిందని రైతులు తెలిపారు.