వేల్పూర్ మండల కేంద్రం, అమీనాపూర్ తో పాటు పలు గ్రామాల్లో మంగళవారం, బుధవారం కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నోటి కాడికి వచ్చిన ముద్ద నేల పాలవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ట్రార్పలిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది రైతుల వరి ధాన్యం తడిసిపోయాయి. రైతులు తమ ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.