మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితుల ఆర్థిక సహాయం

ముప్కాల్ మండల కేంద్రంలో అనారోగ్యంతో కాలు తొలగించుకున్న బాల్య మిత్రుడు నరేష్ కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. 2002-2003 టెన్త్ బ్యాచ్ కు చెందిన స్నేహితులు రూ. 25,500 ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ మిత్రుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్నేహితుల స్పందన పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి, సందీప్, ప్రతాప్ రెడ్డి, అశోక్, ప్రవీణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్