కమ్మర్ పల్లి: వడ్డీ రాయితీ మంజూరు పట్ల హర్షం

ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ డబ్బులు మంజూరు చేసింది. ఇదే సందర్భంలో ఇందిరా జీవిత బీమా పరిహారం అందజేయడంపై కమ్మర్ పల్లి ఐకెపి మహిళలు, సిబ్బంది శనివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను ప్రజా నిలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్