కిసాన్ నగర్ పద్మశాలి సంఘంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల కేంద్రంలోని కిసాన్ నగర్ పద్మశాలి సంఘంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఆదివారం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్న తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు మ్యాక నరేందర్, ఉపాధ్యక్షుడు మోహన్, మానేటి నాగభూషణం, శివకుమార్, జిందం రాజు, ఆయా పంథాల అధ్యక్షులు దాసరి వెంకటేష్, చాట్ల, శ్రీనివాస్, అల్లే ప్రసాద్, రేగొండ భూమేశ్వర్, రాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕