బాల్కొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం మార్కండేయ మందిరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి ఆధ్వర్యంలో కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సమాజ సేవ, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈకార్యక్రమంలో సంఘం సభ్యులు భూస రత్నాకర్, మేక నాగేశ్, కుందారపు శ్రీనివాస్, జక్కుల రాజు, బిష్మచారి, నారాయణ, బోగ చిన్న భూమేశ్వర్, మైసరి పెద్ద గంగాధర్, చిన్న గంగాధర్, మామిడాల రాజు, బోగ సత్యనారాయణ, బుస శ్రీహరి, ఎక్కాలదేవి సురేష్, మైసరి సృజన్, మేక సతీష్, పొన్నరాజ నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕