బాల్కొండ నియోజకవర్గంలోని కాకతీయ కాలువ వెంబడి ఉన్న గ్రామాల రైతులు పసుపు పంట సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) నుండి కాకతీయ కాలువకు వెంటనే లీకేజ్ నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది పొడవునా కాకతీయ కాలువలో నీరు నిల్వ ఉండేదని, దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేవారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కాలువలో పూర్తిగా నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.