కిడ్నీ వ్యాధి చికిత్సకు ఎల్‌ఓసీ మంజూరు

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మాగాణి రాములు అనే రైతు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించడంతో, వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి (Letter of Credit) మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ రామరాజు గౌడ్, సీనియర్ నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕