ముప్కాల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో రోడ్డు దెబ్బతింది. తవ్విన రోడ్డును సరిగా పూడ్చకపోవడంతో, వర్షాకాలంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. స్థానికులు, వాహనదారులు R&B అధికారులు స్పందించి మొరం స్థానంలో రోడ్డు వేయాలని కోరుతున్నారు. ఈ సమస్యపై గతంలో మిషన్ భగీరథ ఏఈ చర్యలు తీసుకున్నప్పటికీ, రోడ్డు మరమ్మతులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.