మెండోర మండలంలోని పోచంపాడు తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో “నశాముక్త్ యువ – వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమాజ అభివృద్ధిలో యువత పాత్రపై కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. మద్దుల రాకేష్, డా: అనిల్, సబ్ యూనిట్ ఆఫీసర్ మురళి, సూపర్వైజర్ వనమాల, ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ ఏథమా తదితరులు పాల్గొన్నారు.