నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్ పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో గురువారం నూతన గ్రామాభివృద్ధి కమిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగమైన ఈ భవనాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ఇది గ్రామ సమస్యల పరిష్కారానికి సులువైన మార్గమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలకృష్ణ, వీడీసీ సభ్యులు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.