నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని 13వ పోలింగ్ బూత్‌లో భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటర్ జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో మంగళవారం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)తో కలిసి ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, సరైన వివరాలను నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాల్కొండ 13వ బూత్ అధ్యక్షులు ఆరేపల్లి రవీందర్, BLO-2 ఆరేపల్లి నర్సయ్య, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు సుంకం శ్రీనివాస్, సీనియర్ నాయకులు తిరుమలేశ్, దన్పల్, ఉత్తేజ్, అక్షయ్, దినేష్, రాహుల్ పాల్గొన్నారు.