నవీపేట్ శివారులోని బాదావత్ వసంత్ పొలంలో గల ఎస్ఎస్ 110 కేవి ట్రాన్స్ఫారంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫారం ఆయిల్ చోరీకి పాల్పడ్డారు. గతంలో సైతం ట్రాన్స్ఫార్మర్లతో పాటు కేబుల్ దొంగతనాలు తరచూ జరుగుతున్న పోలీసు అధికారులు మాత్రం దొంగలపై నిఘా పెట్టకపోవడంతో దొంగలు మరింత విజృంభిస్తున్నారని, దీనివల్ల రైతుల పొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని రైతు బాధావత్ వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు.