జలాల్పూర్ గ్రామంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహణ

బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు. పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ స్వర్ణలత, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేవతి, మండల వైద్య సిబ్బంది, ఏపీవో ఇందిర, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఏఎన్ఎం సరోజ, స్థానిక ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎం అభిమన్యు, కృపాని, మండలంలోని సమస్త అంగన్వాడీ టీచర్లు, స్థానిక అంగన్వాడీ టీచర్లు పద్మావతి, పుష్పలత, ఆశా వర్కర్ రజిని, ఉప సర్పంచ్ బోజన్న, పాలకవర్గ సభ్యులు శేఖర్, గంగు బాయి, కారోబార్ వేణుగోపాల్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕