నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో రఘురాం, సర్పంచ్ డొల్ల రమేష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సన్న రకం ఏ గ్రేడ్ వరికి రూ. 2461తో పాటు రూ. 500 బోనస్ ఉందని, దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది, కార్యదర్శి, జిపిఓ, నాయకులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.