నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ నిమజ్జనం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో గ్రామానికి చెందిన అడ్డశెర్ల లలిత రూ. 5000 చెల్లించి లడ్డును దక్కించుకున్నారు. సంఘం అధ్యక్షుడు నరేందర్, కార్యవర్గ సభ్యులు మోహన్, రాజు, శివకుమార్ లు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. సంఘ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.