నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ దాసరి గంగాధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 0-5 సంవత్సరాల లోపు సుమారు 80 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్యకరమైన జీవితానికి పోలియో చుక్కలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంతంగి మదన్, ఆశా వర్కర్ వనిత, అంగన్వాడి టీచర్లు అంబికా రాణి, విజయ కళ, మహిళా సంఘం CA వనిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.