నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో పద్మశాలి గణేష్ మండపం వద్ద ఆదివారం మహిళల రంగవల్లిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతలుగా సుమలత, లహరి వ్యవహరించగా, గుండుక సుకన్య ప్రథమ, దీకొండ లావణ్య ద్వితీయ, అల్వాల రేణుక తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. సంఘం అధ్యక్షుడు మ్యాక నరేందర్, ఉపాధ్యక్షుడు చిలువేరీ మోహన్, ప్రధాన కార్యదర్శి జిందం రాజు, సలహాదారుడు శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.