శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రూ.32.55 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ, ప్రధాన కాలువల మరమ్మత్తుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.32.55 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు బాల్కొండ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక కాలువలు శిథిలావస్థకు చేరాయని, కాకతీయ, వరద కాలువల మరమ్మత్తులకు ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్