పిప్రి జే గ్రామంలో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన సర్పంచ్

భీంగల్ మండలంలోని పిప్రి (జే) గ్రామంలో సర్పంచ్ జనార్ధన్ ఆధ్వర్యంలో గుంతల మయమైన రోడ్లపై మరమ్మత్తులు చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో స్కూల్ పిల్లల పట్ల, వాహన దారుల పట్ల ఇబ్బందులను గమనించిన సర్పంచ్ తక్షణ చర్యలు చేపట్టారు. చిప్స్, వైట్ మిక్స్ వంటి వాటితో రోడ్లపై గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంజిత్, వి డి సి సభ్యులు, జిపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్