వేల్పూర్ మండలంలో శుక్రవారం మోతె ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వైద్య గణేష్ పూలమాలవేసి సభను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రను తెలియజేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.