కమ్మర్పల్లి మండల కేంద్రంలో గృహావసరాల గ్యాస్ సిలిండర్లతో మినీ సిలిండర్లు నింపుతూ వ్యాపారం చేస్తున్న కావల్ల యాదగిరి దుకాణంపై సివిల్ సప్లై డీటీ పవన్ బృందం దాడి చేసింది. దుకాణంలో 5 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని ఇండెన్ గ్యాస్ గోదాంకు తరలించారు. ఈ ఘటనపై నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అడిషనల్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో కమ్మర్పల్లి మండల రెవెన్యూ అధికారి శరత్ కుమార్, జీపీ వోలు కే అశోక్, పి అజయ్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.