బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సిట్‌లు, కమిషన్ల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నోటీసులను నిరసిస్తూ వేల్పూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు. ఉద్యమ నాయకుడిపై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రశాంత్ రెడ్డి అన్నారు.