సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

బాల్కొండలోని మెండోర మండలం పోచంపాడ్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, మెండోర ఎస్సై సుహాసిని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏసిపి విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి నివారణ మార్గాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్