భారత ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి బాల్కొండ మండలం పరిధిలోని జలల్పూర్ గ్రామం 2025 నాటికి టీబీ ముక్త్ పంచాయతీగా అవార్డు పొందింది. ఈ పురస్కారాన్ని జిల్లా అదనపు కలెక్టర్, డీఎం&హెచ్‌ఓ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గుండేటీ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గుండ దేవేందర్, ఆశ వర్కర్ రజినీ, హెల్త్ సూపర్వైజర్ సంతోష్ సోమవారం అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.