నిజామాబాద్ జిల్లా చెంగల్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయుడు రమేష్ ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం, వర్షాలు సమృద్ధిగా కురవడం కోసం ఈ మొక్కలు దోహదం చేస్తాయని సర్పంచ్ మమత, రాజు తెలిపారు. మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ వహించాలని వారు కోరారు. ప్రభుత్వం కూడా మొక్కల పెంపకం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, కార్యదర్శి వినయ్, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.