జాగిర్యాల్‌లో విషాద ఘటన.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం, జాగిర్యాల్‌ గ్రామంలో శనివారం నూకల మమత (43) అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. తన నూతన ఇంటిలో బల్బు ఫిట్టింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. తీవ్ర షాక్‌తో ఆమె మరణించింది. భర్త మల్లేష్‌ ఫిర్యాదు మేరకు భీంగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕