కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో 8 గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో రాజశ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, వాటికి అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ శిక్షణ గ్రామ పాలనలో సభ్యుల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో జరిగింది.