తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన తాటకారి యాదమ్మ కుమార్తె చింతలూర్ రాధ, తన ఇద్దరు పిల్లలు స్నేహిత్, ఆద్యలతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై సంజీవ్ శనివారం తెలిపారు. రాధకు 9 ఏళ్ల క్రితం భీమ్గల్కు చెందిన ప్రశాంత్తో వివాహం జరిగింది. జూన్ 25న సాయంత్రం పిల్లలతో కలిసి వేల్పూర్కు వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్లిన రాధ, ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్