నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని జలాల్పూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులందరికీ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్య, క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ రెడ్డి, ఏ పీ ఎం గంగారాం, వీ ఏ ఓ సుప్రియ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు పద్మావతి, హెచ్ ఎం అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.