అక్లూర్ పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా యూనిఫామ్స్ పంపిణీ

నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం టి. ఎస్. సోనీ, ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీవిద్య, సెక్రటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕