వేల్పూర్ మండలం కేంద్రంలోని పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఇటీవల పదవ తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచి బాసర్ మహబూబ్ నగర్, త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన అలోక్, సుశాంత్, కిరణ్ ను ఘనంగా శాలువా మెమొంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రా, ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.