నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, వర్షాకాలంలోనే ఈ దుస్థితి ఉంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.