కోనాపూర్ లో అలరించిన మహిళా శక్తి కళాజాత

ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గురువారం కోణాపూర్ లో సాంస్కృతిక సారథి కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కలజాత ఆహుతులను అలరించింది. కల్చరల్ కోఆర్డినేటర్ అస్ట గంగాధర్ ఆధ్వర్యంలో కళాకారులు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పధకాలపై వివిధ రకాల పాటల రూపంలో కళా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని ప్రతి ఒక్క మహిళ సంఘాల్లో చేరి ఈ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కుంట గంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్