ముప్కాల్ మండల కేంద్రంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని మేలుకోల్పాలని కోరుతూ ఆదివారం నాడు నాయకుడు సంతోష్ ఫౌండేషన్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువకుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ పాల్ మాట్లాడుతూ యువకులు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని, సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. నాయకుడు సంతోష్ ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ యువతను చెడు మార్గంలో నడిపించే ఈ సమస్య వల్ల శరీరానికి హాని జరుగుతుందని, మండలంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.