రేవంత్ రెడ్డి సర్వేపై ప్రశాంత్ రెడ్డి అనుచరుడి ప్రశ్నల వెల్లువ

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరుడు జయరాం శ్రీనివాస్ నాయక్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై యువకుడు ప్రశ్నించిన సంఘటనను లోకల్ మీడియాకు పోస్ట్ చేశారు. ప్రభుత్వం తరఫున కులాలు, విద్య, ఉపాధి వంటి వివరాలు సేకరిస్తున్నారని సర్వే చేస్తున్న యువతి చెప్పింది. 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన ప్రభుత్వం ఈ సర్వే ఎందుకు చేస్తోందని యువకుడు ప్రశ్నించగా, కలెక్టర్ ఆదేశాల మేరకే సర్వే చేస్తున్నామని యువతి బదులిచ్చింది. ఈ సర్వే వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదని నాయక్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్