ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతుల బంధువు, పేద ప్రజల పెన్నిధి, రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలకు జీవం పోసిన ఆయన ఆశయ సాధనాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ మహేష్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.