బాన్సువాడ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం వికటించడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట స్థానిక వార్డు కౌన్సిలర్ ఖాలేఖ్, ఆర్ఎంఓ సుజాత, డాక్టర్ శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.