బాన్సువాడలో గురువారం జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీసీ విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, రాఘవేంద్ర ఆరోపించారు. గత నాలుగు సంవత్సరాల నుండి 7వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విట్టల్, రాజు, శివకుమార్, బాబు, చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.