ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో, శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కలిసి బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామానికి చెందిన 122 మంది 2BHK లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి, బీర్కూర్ తహసీల్దార్ సవాయి సింగ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్