తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన

బాన్సువాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు భునేకర్ సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు నెలల లోపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలులో ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) కొనసాగిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఎసి నాయకులు సంగమేశ్వర్, రవీంద్రనాథ్, అయ్యల సంతోష్ , వేద ప్రకాష్, కృష్ణ, అరుణ్, తారాచంద్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్