ప్రభుత్వం మాలలకు న్యాయం చేయాలి

బాన్సువాడ మండల కేంద్రంలో గురువారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ వల్ల విద్య, ఉద్యోగ నియామకాల్లో మాలలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మాలలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు, డివిజన్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్