నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గం జానకం పెట్ గ్రామంలో ఆదివారం, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గోదావరి జలాలతో గ్రామ దేవతల ఆలయాలలో ఆదివారం అభిషేకాలు నిర్వహించారు. శ్రీ మహలక్ష్మి ఆలయం, పెద్ద హనుమాన్ ఆలయంతో పాటు గ్రామ దేవతల ఆలయాలలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. అనాదిగా వస్తున్న గ్రామ సంప్రదాయాల ప్రకారం ఈ నెలలో రెండవసారి అభిషేకాలు చేసినట్లు గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాదాకిషన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాధాకిషన్ గౌడ్, జనకం పేట్ స్వయంభూ లింగేశ్వర ఆలయ కమిటి చైర్మన్ ఉప్పుసురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.