బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో, ఓ ఎస్సై భాస్కర చారి రూ. 7000/- లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక పాత కేసు విషయంలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.