రైతులకు అండగా ప్రభుత్వం: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సాలూర వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు అల్లే జనార్ధన్, రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని, దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వింటాల్ ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2389లు, బి గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2369లు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్