తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా బోధన్ పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం తెల్లవారు జాము నుండి భక్తులు మారుతి మందిరంలో గల విట్టలేశ్వరుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మధు మహరాజ్ ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. తొలి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని అన్నారు.