కల్దుర్కి గ్రామంలో ఘనంగా బోనాలు

బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు, పిల్లలు సాంప్రదాయ వస్రాలను ధరించి బోనాలను ఎత్తుకొని గ్రామ దేవతల ఆలయాలకు డప్పు చప్పుళ్ళ మధ్య తరలి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని పాడి, పంటలు సంవృద్దిగా పండాలని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల పండగ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్