11 మందిపై కేసు నమోదు

పోతంగల్ గ్రామానికి చెందిన గంధపు దత్తుపై దాడి చేసిన 11 మందిపై కోటగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి వ్యక్తిగత కారణాలతో ముత్యాల సాయివిశాల్, ప్రవీణ్ గౌడ్, షేక్ ముజీబ్, మహేందర్, గోవింద్, గంధపు రాజు, గంధపు గంగారాం, రజాక్, లింగాగౌడ్, సుభాష్, ముత్యాల భాగయ్యలు గంధపు దత్తు ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ముత్యాల సాయివిశాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సునీల్ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్