ఎడపల్లి మండలంలో హోలీ సంబరాలు

ఎడపల్లి మండలంలోని కూర్నపల్లి, తానకలన్, ఎడపల్లి గ్రామాల్లో హోలీ పండుగ వేడుకలు ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహభరితంగా, ఘనంగా మంగళవారం నిర్వహించబడ్డాయి. రంగుల పండుగ సందర్భంగా మూడు గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నారులు, యువకులు రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేశారు. గ్రామ వీధులు రంగులతో కళకళలాడాయి. మహిళలు ఇళ్లలో ప్రత్యేక వంటకాలు తయారు చేసి బంధుమిత్రులతో పంచుకున్నారు. పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి సామరస్యాన్ని చాటారు.

సంబంధిత పోస్ట్