ఎస్సై శిరీషను సన్మానించిన ఉషోదయ విద్యాసంస్థల చైర్మెన్

నిజామాబాద్ జిల్లా, బోధన్ లోని ఉషోదయ మహిళా జూనియర్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని మెదక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పవార్ శిరీషను ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్య ప్రకాష్ గురువారం సన్మానించారు. 2016-2018 మధ్య ఇంటర్ చదివి, 987 మార్కులతో ఉత్తీర్ణురాలై, హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శిరీషను ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఉషోదయ విద్యాసంస్థల డైరెక్టర్ రమణి ఆమెను శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్